విద్యార్థుల పరిశుభ్రతపై ప్రధానోపాధ్యాయులకు శిక్షణ

అపోలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం

పయనించే సూర్యుడు మార్చి 12 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విద్యార్థుల పరిశుభ్రతపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అపోలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో డెట్టాల్ స్కూల్ హైజీన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌పై ఈ శిక్షణ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల బిజినపల్లిలో జరిగింది. ఈ సందర్భంగా అపోలో ఫౌండేషన్ ప్రతినిధులు ఎన్. రఘువరన్. డి. చరణ్, కె. కృష్ణ. ప్రధానోపాధ్యాయులకు శిక్షణ అందించారు. విద్యార్థుల్లో పరిశుభ్రత అలవాట్లు పెంపొందించేందుకు పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. చేతులు కడుక్కోవడం, వ్యక్తిగత పారిశుధ్యం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఇంటరాక్టివ్ సాధనాలు, ఎస్ టి ఈ ఎం ఆధారిత కిట్లు, అలాగే ప్రతి పాఠశాలలో “హైజీన్ కార్నర్”లను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజినపల్లి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *