పయనించే సూర్యుడు న్యూస్ , మార్చి12 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ): పట్టణములోని క్వారీపేట కాలనీలో ఆహార పదార్థాలను పేద ప్రజలకు వివేకనంద సేవాసమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు సూచనల మేరకు పెండ్యాల రాజు ఆధ్వర్యంలో బుధవారం వితరణ చేశారు.ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ గునాడ గ్రామ వాస్తవ్యులు మోటేపల్లి అశోక్ చంద్ర తేజ,బిందు వివాహం సందర్భంగా దారపల్ల మురళీకృష్ణ ఆహార పదార్థాలను పంపించడం జరిగిందన్నారు.అలాగే ఎవరైనా పుట్టినరోజు,పెళ్లిరోజు తదితర శుభకార్యములకు మిగిలిన ఆహార పదార్థాలను వివేకానంద సేవా సమితి సభ్యులకు తెలియజేస్తే వాటిని వితరణ చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో వివేకానంద సేవా సమితి సభ్యులు పెండ్యాలరాజు,సేనాధిపతి రాజబాబు,కాలనీవాసులు నాగేశ్వరరావు, గంగాధర్,పండు తదితరులు పాల్గొన్నారు.