వీధి వ్యాపారుల సమస్యలు పరిష్కరించండి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పూర్తి చెయ్యాలని

మేయర్ కోలగని శ్రీనివాస్ కు బిఎంఎస్ నేతల వినతి

పయనించే సూర్యుడు మార్చి 12 కరీంనగర్ న్యూస్: కరీంనగర్ నగరంలోని వీధి వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలని ,ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ బుధవారం రోజున భారతీయ మజ్దూర్ సంఘ్ నాయకులు నగర మేయర్ కోలగాని శ్రీనివాస్ ని కలసి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో వీధి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారని, ప్రధాన రహదారులు, మున్సిపల్ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో కూరగాయలు, చిరు సామాగ్రిని విక్రాయిస్తు జీవనోపాధిని పొందుతున్నామని తరచూ మున్సిపల్ సిబ్బంది,ట్రాఫిక్ పోలీసులు తమ సామాగ్రిని జప్తు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తమకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు కలెక్టర్ బంగ్లా ఎదురుగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేసి, వెంటనే అందుబాటులోకి తీసుకురావాలిని దీనివల్ల వ్యాపారులకు శాశ్వత వేదిక లభిస్తుందిని కోరారు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది వీధి వ్యాపారులను వేధిస్తున్నారని, సామాగ్రిని జప్తు చేస్తున్నారని వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరించడం మానుకోవాలని కోరారు. మార్కెట్ అందుబాటులోకి వచ్చే వరకు వీధి వ్యాపారులు ప్రశాంతంగా వ్యాపారం చేసుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పసుల శ్రవణ్ జిల్లా కార్యదర్శి తొర్తి శ్రీనివాస్, స్ట్రీట్ వెండార్స్ నాయకులు ఆకుల తిరుపతి, నక్క అరుణ్, రమణయ్య, శ్రీనివాస్, మంజూల తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *