వ్యాపార సంస్థలుగా కాకుండా, విద్యా సంస్థలుగా సేవ చేయండి.

★ భారతీయ జనతా యువమోర్చా నాయకులు.

పయనించే సూర్యుడు మార్చి 12 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్ట్ కృష్ణ కాలేజీ ఫీజు తో సంబంధం లేకుండా ఎగ్జామ్ ఫీజు కట్టించుకోవాలని స్థానిక ఆర్ట్స్ కళాశాలలో భారతీయ జనతా యువమోర్చా నాయకులు ప్రిన్సిపల్ చంద్రశేఖర్ ను కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు. ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్న కొంతమంది విద్యార్థులు స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వచ్చి కాలేజీ ఫీజు పెండింగ్లో ఉంటే ఎగ్జామ్ ఫీజు తీసుకోవట్లేదని ఎమ్మెల్యే పార్థసారధికి విషయాన్ని తెలియజేయడంతో వారు బీజేవైఎం నాయకులకు ఈ విషయాన్ని చెప్పి విద్యార్థులకు అండగా నిలవాలని తెలియజేశారు. ఈ విషయం పైన యువమోర్చ నాయకులు ప్రిన్సిపల్ తో మాట్లాడడం జరిగింది, కాలేజీ ఫీజుతో సంబంధం లేకుండా ఎగ్జామ్ ఫీజు కట్టించుకుంటామని ప్రిన్సిపల్ హామీ ఇచ్చారు.