శ్రీ తిరుపతమ్మ అమ్మవారి పుణ్యక్షేత్ర మహోత్సవం కార్యక్రమాలు ప్రశాంతంగా చిన్న తిరుణాల మహోత్సవం ముగింపు

* మా వార్త లు ప్రతినిధితో ప్రత్యేక స్టోరీ తో మీ ముందుకు వస్తున్న శ్రీ శ్రీ తిరుపతమ్మ అమ్మవారి అమ్మవారి కథనం

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 12 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున తో శ్రీ శ్రీ శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరుణాల మహోత్సవ కార్యక్రమం ఈరోజుతో ముగుస్తుంది ఈ సందర్భంగా ఆల య అర్చకులు మర్రిబోయిన గోపి బాబు మా పయనించే సూర్యుడు జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి ప్రతినిధి చేని రాంబాబు తో ప్రత్యేక కథనం రూపిస్తూ ఆలయ ప్రధాన అర్చకులు మర్రిబోయిన గోపి బాబు ప్రత్యేక స్టోరీ ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ శ్రీ శ్రీ తిరుపతమ్మ అమ్మవారి పుణ్యక్షేత్ర మహోత్సవం ఆధ్యాత్మిక పారవశ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అత్యంత ప్రధాన దేవాలయాల్లో తొమ్మిదవ స్థానంలో, ఎన్టీఆర్ జిల్లాలో రెండవ విశిష్ట క్షేత్రంగా విరాజిల్లుతున్న పుణ్యధామం-శ్రీ గోపయ్య స్వామి సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం. పవిత్ర మున్నేరు నదీ తీరాన, ప్రకృతి ఒడిలో వెలసిన ఈ పెనుగంచిప్రోలు క్షేత్రం, ఆధ్యాత్మిక చైతన్యానికి నిలయం. వైభవంగా ముగిసిన చిన్న తిరునాళ్లు తేదీ 04/03/2026 నుండి 08/03/2026 వరకు జరిగిన “చిన్న తిరునాళ్లు” మహోత్సవం భక్తుల కోలాహలం మధ్య అత్యంత అద్భుతంగా, కనులపండువగా సాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో పెనుగంచిప్రోలు వీధులన్నీ ఆధ్యాత్మిక పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ప్రతి అడుగులోనూ “అమ్మ” నామస్మరణ మారుమ్రోగుతూ, భక్తులను భక్తి సాగరంలో ముంచెత్తింది. సాక్షాత్తూ అమ్మవారు నడయాడిన పుణ్యధామం దేశవ్యాప్తంగా ( శ్రీ మహా గణపతి ఆలయం, శ్రీ శివాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ నరసింహస్వామి ఆలయం, శ్రీ అమ్మవార్ల ఆలయాలు మాదిరిగా) శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయాలు ఎన్నో ఉన్నప్పటికీ, ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. శ్రీ గోపయ్య స్వామి, తిరుపతమ్మ అమ్మవారు సాక్షాత్తూ ఈ నేలపై స్వయంగా నడయాడి, వారి పాదస్పర్శతో పునీతం చేసిన పవిత్ర పుణ్యభూమి ఇది. అందుకే ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి భక్తుడికి అమ్మవారి సామీప్యం లభించినట్లుగా ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. చిరస్థాయిగా నిలిచే అనుభూతులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్న భక్తుల హృదయాల్లో ఒకటే తపన… అది “మరలా ఎప్పుడు పెనుగంచిప్రోలు వస్తామా? మన తిరుపతమ్మ తల్లిని కనులారా చూసి ఎప్పుడు తరిస్తామా?” అన్న ఆరాటం. ఇక్కడ గడిపిన ప్రతి క్షణం వారి జీవన ప్రయాణంలో ఒక మధురమైన జ్ఞాపకంగా, ఆధ్యాత్మిక ఆనంద నిధిగా భక్తుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *