పయనించే సూర్యుడు మార్చి 12 కరీంనగర్ న్యూస్: సంచార జాతులు, సమగ్ర సర్వే, సంచార , అర్థసంచార , విముక్త జాతుల ఆర్థిక సామాజిక స్థితిగతుల అధ్యయనంపై రూపొందించిన పుస్తకాన్ని బుధవారం రోజున కరీంనగర్లో మేయర్ కోలగని శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ కోలగని శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలోనే మొదటి సారి సంచార జాతుల పై తెలంగాణ లో సామాజిక సమరసతా వేదిక సమగ్ర సర్వే నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సామాజిక సమరత బాధ్యులు మాట్లాడుతూఅక్టోబర్ 26 నుండి డిసెంబర్ 31 వరకు తెలంగాణలోని 29 జిల్లాల్లో 33 తెగల వారిని సమరత కార్యకర్తలు కలిశారని, 1450 కుటుంబాల వద్దకు 70 మందికి పైగా సమరసతా కార్యకర్తలు వెళ్లి 7000 మందికి పైగా కుటుంబ సభ్యుల వివరాలను సేకరించారని తెలిపారు. ముఖ్యంగా ఈ సందర్భంగా ఆర్థిక,సామాజిక, సాంస్కృతిక అంశాలతో పాటు 25 కి పైగా విషయాలను ప్రశ్న్తావళిగా రూపొందించడం జరిగిందన్నారు. వాటి ఆధారంగా సేకరించిన సమాధానాలతో పారదర్శకమైన గణంకాలతో మ్యాప్ లు,గ్రాఫ్స్ తో , 136 పేజీలతో కలర్ బొమ్మలతో కూడిన ఒక పుస్తకం ప్రచురించటం జరిగిందని వివరించారు. దీని వల్ల అటు ప్రభుత్వానికి,ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం,విశ్వ విద్యాలయాల కులపతులు,ఆచార్యులకు, సివిల్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు,ఇటు సేవా కార్యక్రమాలు చేసే స్వచ్చంద సేవా సంస్థలకు,సామాజిక కార్యకర్తలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. ప్రధానంగా స్వాతంత్య్రం పొంది ఇన్నేళ్ళైనా సంచార జాతులు రాజ్యాంగ ఫలాలు అందక,బిక్కు బిక్కుమని బ్రతుకులు ఈడుస్తున్న దీన,దుఖితులు ఇంకా ఈ సమాజంలో వున్నారనే సత్యం అందరికీ బోధ పడుతుందన్నారు. పక్కా ఇళ్ళు, చదువు, వైద్యం, టాయిలెట్స్, విద్యుత్, ఉద్యోగాలు, మంచి నీళ్లు, ప్రభుత్వ పథకాలు,కుల సర్టిఫికెట్స్,ఆధార్ కార్డులు మొదలైనవి అందక జీవిస్తున్న ఈ వర్గాల వారి కోసం సమరసతా వేదిక అండగా నిలుస్తుందన్నారు. అటు పాలకులు ఇటు సభ్య సమాజం ఈ వర్గాల వారిని తోటి భారతీయులుగా భావించి,వారి అభ్యున్నతికి ఉపయోగపడే సూచనలు,సలహాలు అందించే విధంగా ఈ పుస్తకం తెలుగులో,ఇంగ్లీష్ భాషలలో ప్రచురించడం జరిగిందని తెలిపారు.ఇట్టి కార్యక్రమం లో సామజిక సమరసత వేదిక జిల్లా అధ్యక్షులు తుమ్మల రమేష్ రెడ్డి, తెలంగాణ ప్రాంత కార్యదర్శి పుల్లూరి రామారావు,బోయిని పురుషోత్తం,కనికరం లక్ష్మణ్, ఉండేటిశ్రీకాంత్, దావు సంతోష్ కుమార్ సమరసత సభ్యులు పాల్గొన్నారు.
.