
పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ న్యూస్ మార్చ్ 12 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణానికి చెందిన జన్మదిన సందర్భంగా టివైఆర్ ఫౌండేషన్ చైర్మన్ తలకొక్కుల రాజు స్పష్ఠీకరణ సామాజిక సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తామని ప్రముఖ న్యాయవాది, టివైఆర్ ఫౌండేషన్ చైర్మన్ తలకొక్కుల రాజు స్పష్టం చేశారు. మంగళవారం టీవైఆర్ ఫౌండేషన్ విజ్ఞాన కేంద్రంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అభిమానులు, ఆయా పార్టీల నేతలు, యువత, విద్యార్థులు తదితర వర్గాలు ఆయనను సత్కరించి జన్మదిన కేక్ కట్ చేయించడంతోపాటు ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశా. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా అందిస్తున్న సేవలు ఎంతో సంతృప్తి కలిగిస్తున్నట్లు చెప్పారు. హైటెక్ టెక్నాలజీతో విజ్ఞాన కేంద్రం ఏర్పాటు, ప్రభుత్వ బడుల అభివృద్ధికి చేయూత, పోటీ పరీక్షలు దృష్ఠిలో పెట్టుకొని నూతన పరిజ్ఞానం, విద్యా విధానానికి ప్రాధాన్యత నిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల కోర్సులు, ఉద్యోగ నోటిఫికేషన్లు, విద్యా బోధన వివరాలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. అంతే కాకుండా టివైఆర్ ఫౌండేషన్ నాలెడ్జ్ సెంటర్లలో కంప్యూటర్లు ఏర్పాటు చేసి ఫిజికల్ గా, వర్జికల్ గా అవసరమైన శిక్షణ, విద్యనoదిస్తుండగా, శాస్త్రవేత్తలు, సాహిత్యం, ఆధ్యాత్మికం, రైతాంగ పోరాటం, అభ్యుదయ సాహిత్యం, పురాణ గాథలు, జ్ఞానపీఠ అవార్డు, నోబెల్ గ్రహీత, భారత రత్న, జంతు ప్రపంచం, ప్రముఖుల వివరాలు తదితర టివైఆర్ నాలెడ్జ్ సెంటర్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. పోటీ ప్రపంచంలో యువతకు అవసరమయ్యే విజ్ఞానo కోసం ఇబ్బంది పడకుండా ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియని, లాభాపేక్ష లేకుండా చేపట్టిన ఈ మహాయజ్ఞంతో పేద విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో మాజీ గజ్వెల్ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కివోద్దీన్ తంజీముల్. గజ్వెల్ అధ్యక్షుడు సయ్యద్ మతిన్ సభ్యులు ముస్లిమ్ సోదరులు తదితరులు ఉన్నారు