సాలూర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చెస్ బోర్డులు పంపిణీ

★ పంపిణీ చేస్తున్న సంస్థ ప్రతినిధి కిరణ్ కుమార్ రెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 12 బోధన్ :సాలూర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చెస్ నెట్వర్క్ సంయుక్త భాగస్వామ్యం ఆత్మ చరణ్ రెడ్డి మాజీ పార్లమెంట్ సభ్యులు, కాకతీయ శాండ్ బాక్స్ ఆధ్వర్యంలో సాలూర మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు 1260 మంది విద్యార్థులకు 65 చెస్ బోర్డులను సంస్థ ప్రతినిధులు. కిరణ్ కుమార్ రెడ్డి, హనుమంతు పంపిణీ చేశారు. చెస్ అట ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ఉంటుంది అని జీవితంలో కూడా ఆటుపోట్లు ఉంటాయి అని చెప్పారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజీ మంజూష మాట్లాడుతూ ఆమె చిన్నతనం నుండి చేస్ అట తెలుసు అని అటలతో క్రమశిక్షణ మనో ధైర్యం గౌరవం లభిస్తుంది అని చెప్పారు.ఈ కార్యక్రమంలో సాలూర మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు చెస్ బోర్డులు అందుకున్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఆ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు