పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, సెంటినరి కాలనీ -12 సింగరేణి కంపెనీలో గత కొన్ని నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించకపోవడం బాధాకరం కార్మికులందరూ అనారోగ్యంతో బాధపడుతూ మెడికల్ బోర్డు కు అప్లికేషన్ పెట్టుకొని నెలలు కడుస్తున్న కూడా ఇప్పటివరకు మెడికల్ బోర్డు నిర్వహించకపోవడం సింగరేణి యాజమాన్యం నియంత పోకడలకు నిదర్శనం కార్మిక సంఘాలన్నీ కలిసి చిన్న చిన్న సమస్యలకు పోరాటం చేయడం కాదు మెడికల్ బోర్డు కోసం సింగరేణి వ్యాప్తంగా ఉన్న కార్మికుల హక్కుల కోసం సమ్మె చేయాలని కోరారు. రెండు సంవత్సరాల కాలపర్మతి కారుణ్య నియామకం కోసం సింగరేణి ఏర్పాటు చేయడం సరైనది కాదు ఒక్కరోజు ఉన్నా కూడా మెడికల్ అన్ ఫిట్ అయితే కారుణ్య నియామకం ఉద్యోగం ఇవ్వాలని బిజెపి పార్టీ డిమాండ్ చేస్తుంది.అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్మిక హక్కులను కాలరాస్తుంటే గుర్తింపు సంఘం ప్రాతినిధ్య సంఘాలు చోద్యం చూస్తూ ఉన్నాయని కార్మికుల మీద కపట ప్రేమలు కురిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కార్మికులకు అనేకమైన హక్కులు సాధిస్తామని చెప్పి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద పరిశ్రమ సింగరేణి కంపెనీ 42,000 మంది కార్మికులు చేస్తున్న కంపెనీ పట్టించుకోకపోవడం బాధాకరం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక సంఘాలు అన్నీ కలిసి మెడికల్ బోర్డు నిర్వహించేందుకు అవసరమైతే సమ్మె చేయడంలో వెనుకడుగు వెయ్యొద్దని అంటున్నాం కేంద్ర ప్రభుత్వం బిజెపి మీద నిందలు వేసే కార్మిక సంఘాలు మరి కార్మికుల హక్కుల కోసం ఎందుకు సమ్మె చేయరు అని సంఘాలను ప్రశ్నిస్తున్నాం. మెడికల్ బోర్డు విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.