సిసి రోడ్ పనులను ప్రారంభం చేసిన గ్రామ సర్పంచ్

★ వెల్దండ గ్రామ సర్పంచ్ పట్టా యాదమ్మ వెంకటయ్య గౌడ్

పయనించే సూర్యుడు, మార్చి 12 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి వెల్దండ మండల కేంద్రంలో 3వ వార్డు లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో రూ.5 లక్షల మంజూరైన సిసి రోడ్ పనులను స్థానిక సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ బుధవారం ప్రారంభించారు. స్థానిక 3వ వార్డు మెంబర్ గుద్దటి కిష్టల్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు సిసి రోడ్ పనులు చేపట్టినట్లు తెలిపారు. గ్రామ ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్న రహదారి పనులు పూర్తయితే వచ్చిపోయే వాహనాలకు ప్రజలకు సులభమవుతాయని అన్నారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గిరి గౌడ్, మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి, ఉప సర్పంచ్ ఎర్ర శీను ముదిరాజ్, వార్డ్ మెంబర్లు ముదిగొండ కవిత రమేష్, గోసుల కొండయ్య, పిల్లి దేవేందర్, రేవెల్లి మానస రాజు, బాదేపల్లి రమేష్, సిరసనగండ్ల శేఖర్, వాణి పురుషోత్తమ చారి, మల్లీశ్వరి రంగనాథం, గోపి రెడ్డి రాఘవరెడ్డి, కొయ్యల పుల్లయ్య, ఎండి అమీదు, మంగళగిరి శీను, మాడుగుల శంకర్, జోగు రవికుమార్, ఈదులపల్లి రాజు, మట్ట మల్లేష్ గౌడ్, అంగన్వాడి టీచర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.