సీనియర్ నాయకుడు దాట్ల కృష్ణంరాజును పరామర్శించిన తిక్కారెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 12 మంత్రాలయం ఇంచార్జ్ రిపోర్టర్ కౌతాలం మండలం రాజనగర్ క్యాంపులో సీనియర్ నాయకుడు దాట్ల కృష్ణంరాజును కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షుడు పాలకుర్తి తిక్కరెడ్డి పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం బాగోలేదని తెలుసుకున్న తిక్కరెడ్డి స్వయంగా వెళ్లి కలుసుకుని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఆనాటి రాజకీయ పరిణామాలు, పాతకాలంలో జరిగిన రాజకీయ కార్యకలాపాల గురించి గుర్తుచేసుకుంటూ కొంతసేపు మాట్లాడుకున్నారు. రాజకీయాల్లో దాట్ల కృష్ణంరాజు చేసిన సేవలను తిక్కరెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాశీ విశ్వనాథ్ ధని, అల్లూరి వెంకటపతి రాజు, సుబ్రహ్మణ్యం రాజు, మాధవరం అమర్నాథ్ రెడ్డి, పెండాల భరద్వాజ్, కృష్ణారెడ్డి, సిద్దు, కురుగోడు, ఉరుకుంద సర్పంచ్ రవి, రెహమాన్, చిరంజీవి తదితర నాయకులు పాల్గొన్నారు.