హుగ్గేల్లీలో రంజాన్ తోఫా పంపిణీ

పయనించే సూర్యుడు మార్చ్ 12 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు ) హుగ్గేల్లీ గ్రామంలో బుధవారం మైనార్టీ సోదరులకు ప్రభుత్వం అందించే రంజాన్ తోఫా కిట్లను గ్రామ సర్పంచ్ పట్లోళ్ళ విమల శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. పండుగ పూట పేద ముస్లిం కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ తోఫా కిట్లను అందజేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *