పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 12 బోధన్ : సాలూర మండలం హున్సా గ్రామంలో బుధవారం పట్టపగలే కొందరు దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు.గ్రామస్తుల వివరాల ప్రకారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలో కాగితాలు ఎరుతున్నారు .ఈ క్రమంలో గ్రామంలోని ఒక ఇల్లుకు తాళం వేసి ఉండడంతో ఆ దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు.ఇంట్లో ఉన్న వంటసామగ్రితోపాటు నగదును అపహరించినట్లు గ్రామస్తులు తెలిపారు.గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తులను పోలీస్ స్టేషన్ కు తరలించారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.