పయనించే సూర్యుడు మార్చి 12 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ ఆదివాసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చైర్మన్ మరియు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఈరోజు హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసి ముఖ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ ఆదివాసి కాంగ్రెస్ పార్టీ చైర్మన్ డాక్టర్ విక్రమ్ భూక్య, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, టీపీసీసీ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే మురళి నాయక్, రాష్ట్ర ట్రైకార్డ్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర ఆదివాసి కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్మన్లు, జిల్లా చైర్మన్లు, మండల స్థాయి ముఖ్య కార్యకర్తలు కూడా సమావేశానికి హాజరయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఆదివాసి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వైస్ చైర్మన్ కూరాకుల శ్రీనివాస్, ఆదివాసి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ వాల్యూ నాయక్, తిమ్మాజిపేట మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు రాఘవేంద్ర నాయక్, బిజినపల్లి మండల సీనియర్ ఆదివాసి కాంగ్రెస్ నాయకులు ప్రేమ్ నాయక్, ఎరుకల సంఘం జిల్లా నాయకులు కొత్తకోట రవి, అడిగే జగదీష్, బిజినపల్లి రమేష్, సోది చెప్పే నాంచారమ్మలు తదితరులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.