హైదరాబాద్‌లో హాస్టళ్లకు కమర్షియల్ గ్యాస్ కొరత ఇబ్బందులలో హాస్టల్ నిర్వాహకులు..

పయనించే సూర్యుడు, మార్చి 12 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) హైదరాబాద్ నగరంలో హాస్టళ్లకు కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచి పోవడంతో వేలాది హాస్టల్ నిర్వాహ కులు, లక్షలాది మంది అతిథులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలం గాణ రాష్ట్ర ఐటీ కారిడార్ హాస్టల్ అసో సియేషన్ (టీఎస్ఐటి సిహెచ్ఏ) ఆందో ళన వ్యక్తం చేసింది. ఈ విషయంపై అసో సియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి,ప్రధాన కార్య దర్శి తాతా కరుణాకర్ మాట్లాడుతూ… సమస్య తీవ్రతను వివరించారు.హైద రాబాద్ వ్యాప్తంగా సుమారు 11 వేల హాస్టళ్లు ఉండగా,వాటిలో దాదాపు 10 లక్షల మంది అతిథులు నివసిస్తున్నారని తెలిపారు.అయితే అంతర్జాతీయంగా అమెరికా,ఇజ్రాయెల్,ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు,యుద్ధ పరిస్థితుల ప్రభావం తో కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపో యిందని తెలిపారు.గ్యాస్ డీలర్లు ఇప్పటి కే సుమారు 35 శాతం ధర పెంచినప్పటికీ,నిన్నటి నుంచి సరఫరాను పూర్తిగా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.హాస్టల్ నిర్వ హణలో గ్యాస్ ప్రాణవాయువు లాంటి దని,గ్యాస్ లేకపోవడం వల్ల వంటలు చేయడం అసాధ్యంగా మారిందని అన్నారు.ఒక సిలిండర్ ద్వారా రోజుకు సుమారు 309 మందికి మాత్రమే భో జనం తయారు చేయగలమని,ప్రస్తుతం సరఫరా లేకపోవడం వల్ల అల్పాహారం, భోజనాల ఏర్పాటులో తీవ్ర సమస్యలు ఏర్పడ్డాయని తెలిపారు.దీనివల్ల లక్షలా ది మంది విద్యార్థులు,ఉద్యోగులు ఇబ్బం దులు పడే పరిస్థితి నెలకొంది.డీలర్లతో చర్చలు జరిపినా సమస్యకు సరైన పరి ష్కారం దొరకలేదని,కనీసం నామమాత్రం గా అయినా గ్యాస్ సరఫరా చేయాలని కోరామని చెప్పారు.అ వసరమైతే డొమె స్టిక్ గ్యాస్ ద్వారా అయినా హాస్టళ్లకు తాత్కాలికంగా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.హాస్ట ళ్లను ప్రాధాన్యత రంగంగా గుర్తించి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకొని సరిపడ గ్యాస్ అందించాలన్నా రు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం తో ఏర్పడిన ఈ సమస్యను ప్రభుత్వము అత్యవసరంగా పరిష్కరించాలని అసో సియేషన్ ప్రతినిధులు కోరారు.ఈ సమావేశంలో అసోసియేషన్ ట్రెజరర్ మహిధర్,నాయకులు జయరామిరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి,మధు,సూర్య,ప్రతాప్ రెడ్డి, వర్మ, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.