అమ్మవారి నిమజ్జన మహోత్సవం

★ అడుగడుగున అమ్మవారి కి మంగళ హరతులు పట్టి నిమ జ్జ న ఘ ట్ట0 ★ మంగళ, బుధవారం జాతర ముగింపు ఘట్టం.. ★ సాంప్రదాయ పద్దతి లో అమ్మవారి నిమర్జనం..

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 13.03.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 ప్రతినిధి జె. నాగరాజ) పుంగనూరు పట్టణంలో సుగుటూరు గంగమ్మ జాతర ప్రక్రియ చివరి ఘట్టానికి చేరుకుంది. నిమజ్జనం సందర్భంగా గురువారం వేకువ జామున అమ్మవారికి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు.అనంతరం అమ్మవారిని మంగళ వాయిద్యాలతో ఊరిగించారు.అడుగడుగునా మహిళలు కర్పూర హారతులు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.తర్వాత అమ్మవారిని నిమజ్జనానికి తరలించారు.