పయా నించే సూర్యుడు మార్చి 13 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన స్వర్ణ గ్రామ సచివాలయాన్ని ఎంపీడీఓ రాజేశ్వర్ రావు, డిప్యూటీ ఎంపీడీఓ శంకర్ నారాయణ ఆకస్మిక సందర్శన చేసారు. స్వర్ణ గ్రామ సచివాలయం ద్వారా అందిస్తున్న పౌర సేవలపై ఆరాతీశారు. అర్హులైన లబ్దిదారులు అందరికీ సంక్షేమ పధకాలు అందేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని హితవు పలికారు. అనంతరం ఇంటి పన్ను వసూలుకై క్షేత్ర స్థాయిలో పర్యటించారు. విధిగా ఇంటిపన్ను చెల్లించాలని ప్రజానీకానికి పిలుపునిచ్చారు. సదరు సందర్శన లో పంచాయతీ కార్యదర్శి జె వి సత్యనారాయణ, సచివాలయం సిబ్బంది & గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.