ఆర్ సీసీ పైప్ లైన్ తో డ్రైనేజీసమస్యకు శాశ్వత పరిష్కారం:కార్పొరేటర్రాగం నాగేందర్ యాదవ్.

పయనించే సూర్యుడు, మార్చి 13 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) భూగర్భ డ్రైనేజీ సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని డివిజన్ లో మౌలిక వసతులు కల్పిస్తా మని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్… గోపినగర్, నెహ్రూనగర్ లలో డ్రైనేజీ పైప్ లైన్ పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడు తూ.. భూగర్భ డ్రైనేజీ సమస్యల పరిష్కారమే ద్యేయంగా ముందుకు వెళుతున్నామని, పలు కాలనీలలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు అలాగే మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకుని ప్రత్యేక చొరవతో డివిజన్ అభివృద్ధిలో పను లు చేపడుతున్నట్లు తెలిపారు. అత్యవసరం ఉన్న చోట, నిత్యం పొంగుతున్న ప్రాంతలలో ప్రథమ ప్రాధాన్యతగా పనులు పూర్తి చేస్తా మని అన్నారు. అందులో భాగంగా యుద్ధప్రాతిపదికన ప్రత్యేక చొరవతో ఎన్నో ఏళ్ల క్రితం వేసిన ఓపెన్ నాలాల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వాటి స్థానంలో ఆర్ సీసీ పైప్ లైన్ వేయించి శాశ్వత పరిష్కారంగా పనులను ప్రారంభిస్తున్నట్లు కార్పొరేటర్ తెలిపారు. కాలనీలలో మౌలిక వసతులు కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ.. కాలనీలను, బస్తీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తూ సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీలుగా తీర్చిదిద్దడమే ప్రథమ లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డిజిఎం శ్రీహరి, మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్మ, సీని యర్ నాయకులు యాదా గౌడ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్,దేవులపల్లి శ్రీకాంత్, గఫుర్, రవీందర్, సుధాకర్ రెడ్డి, సత్యనారాయణ, నరసింహ, మహేందర్ సింగ్, దస్తగిర్, బబ్లు, సాయి, అలీం, రాంచందర్, శివ, వెంక టయ్య,హరీష్,సలీం,ఉమా, సాయి కిరణ్, విజయ్, వెంకట్, నాందేవ్, సాయికిరన్ గౌడ్, సంతోష్ గౌడ్, శ్రీనివాస్, ప్రసాద్, మహిళలు గిరిజ, శాంత, లక్ష్మి స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.