
పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 13 పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామంలోని ఈరోజున వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగినేని బాబు ఇంటి వద్ద ఉన్న వైస్సార్ విగ్రహం వద్ద. బైపాస్ రోడ్డులోని వైస్సార్ విగ్రహం వద్ద. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద. అనిగండ్లపాడు గ్రామ నాయకులు ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈసందర్బంగా వైస్సార్ విగ్రహాలకు సర్పంచ్ బి.జ్యోతి బ్రాహ్మం ,గ్రామ పార్టీ అధ్యక్షులు వున్నం శ్రీనివాస్ రావు పూలమాల వేసి జండా ఆవిష్కరణ చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కార్మిక కార్షక రైతులలో ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాటి నుంచి నేటి వరకు ప్రజల కోసం ఉంటుంది. ప్రజలు ఉన్నంత వరకు ఉంటుంది. సవాళ్లను సోపానలుగా మలుచుకొని తిరుగులేని శక్తిగా ఆవిర్బవించిన నాటి నుంచి నేటి వరకు అలుపెరుగనిపోరాటం చేస్తూ ఎన్ని సవాళ్లు ఎదురైనా వైస్సార్సీపీ జండా తప్ప వేరే జండా మా భుజాన ఎగరాదు అని అనేక పోరాటాలు అనేక విజయాలు సాధిస్తూ నేడు 16వ వసంతం లోకి అడుగు పెడుతున్న సందర్బంగా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరికి శుభాకాంక్షలు తెలియజేసారు ఈ కార్యక్రమంలో గ్రామ సీనియర్ నాయకులు,యువత మరియు తదితరులు పాల్గొన్నారు