పయనించే సూర్యుడు మార్చి 13 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ లట్టుపల్లి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నులు పంపిణీ చేశారు ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ జి. శ్రీకాంత్. ఈ సందర్భంగా డా. జి. శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఎస్ఎస్సీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆయన చేతుల మీదుగా విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ తిరుపతయ్య, ఉపాధ్యాయులు నాగమణి, మధులత, యాదగిరి, భాస్కర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ శివలీల, చంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.