కమ్మలదిన్నెలో టీడీపీ సీనియర్ నాయకుడు ఈరన్న కన్నుమూత

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 13 మంత్రాలయం ఇంచార్జ్ రిపోర్టర్ పెద్దకడబూరు మండలంలోని కమ్మలదిన్నె గ్రామంలో సీనియర్ నాయకుడు దోడ్డయ్యగారి ఈరన్న గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి నర్వ రమాకాంత్ రెడ్డి ఆయన భౌతికాయానికి పూలమాల వేసి, నివాళులు అర్పిస్తూ, మట్టి ఖర్చులకు రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి నర్వ రమాకాంత్ రెడ్డి రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు. పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు సంఘటితంగా కుటుంబానికి సానుభూతి తెలిపారు.