కలెక్టర్ చేతుల మీదుగా లైసెన్స్ ల జారీ.

పయనించే సూర్యుడు న్యూస్, 13 మార్చ్, 2026,కొమరం భీమ్, ఝాడే భక్త రాజ్, ప్రతినిది శిక్షణ పూర్తి చేసుకొని ఉత్తీర్ణత సాధించిన రెండవ బ్యాచ్ కు చెందిన లైసెన్సుడ్ సర్వేయర్లకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా లైసెన్సులను జారి చేయడం జరిగినది. ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేయబోతున్న ఎంపిక కాబడిన గ్రామాల రిసర్వే లో లైసెన్సుడ్ సర్వేయర్ల పాత్ర కీలకం అని, తమకు వచ్చిన అవకాశన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటుగా జాయింట్ కలెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ అఫ్ ల్యాండ్ సర్వే, మండల సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.