కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు దొంగే దొంగ దొంగ అన్నట్లుంది.

* టిడిపి అధ్యక్షులు గుడిసె ఆదికృష్ణమ్మ.

పయనించే సూర్యుడు మార్చి 13 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటి దినము మీడియా ప్రతినిధుల సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడాన్ని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుడిసె ఆది కృష్ణమ్మ తీవ్రంగా ఖండించారు. వారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కర్నూలు నుండి పత్రికల వారితో మాట్లాడుతూ రాష్ట్రంలో 2019 నుండి 2024 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాడని, వైసిపి ప్రభుత్వం హయాంలో ఏ ఒక్క సామాజిక వర్గం వారికి కూడా న్యాయం చేకూర్చలేదని ముఖ్యంగా రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్తంగా మార్చివేసి తన అన్యాయులకు దోచి పెట్టేందుకు ఎన్నో అక్రమ మార్గాలను చూపించాడని అలాంటి వ్యక్తి నేడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రాష్ట్రంను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారని ముసలి కన్నీరు కారుస్తున్న జగన్మోహన్ రెడ్డి తన ఐదు సంవత్సరాల పాలనలో రాష్ట్రంలో ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారు ప్రజలకు వివరిస్తే బాగుంటుందని ఆమె సూచన చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికార మదంతో ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు రాష్ట్రంలోని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కక్ష సాధింపు చర్యలకే తన పూర్తి సమయాన్ని కేటాయించారని ఏ కారణం లేకుండా ఆనాడు అరెస్టుల పర్వం కొనసాగించారని గుర్తు చేశారు . జగన్మోహన్ రెడ్డి హయాంలో చెత్త పై కూడా పన్ను వేసి ఆ సొమ్మును కూడా తన అనుయాయులకు చేరేలా కృషి చేశాడు తప్ప ప్రజలకు ఆయన చేసిన మేలు శూన్యమని గుర్తు చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మోసపూరితమైన మాటలను నమ్మిన రాష్ట్ర ప్రజలు 2019లో అధికారాన్ని కట్టబెడితే ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేశారని అందువల్లనే జగన్మోహన్ రెడ్డి కి 2024సార్వత్రిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పి కూటమి పార్టీలకు 164 స్థానాలను అప్ప చెప్పారని, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తమ కక్ష తీర్చుకున్నారని అన్నారు. అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయిన తర్వాత మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలా ప్రవర్తిస్తున్నారని నిన్నటి వారి మాటలను బట్టిఅర్థమవుతుందని, జగన్మోహన్ రెడ్డి గతంలో మాదిరిగానే ప్రస్తుతం కూడా ప్రజల మధ్యన చిచ్చు రేపేందుకు కుట్రలు చేస్తున్నారని తన కలబొల్లి మాటలను నమ్ముతారని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసి మరల ప్రజల మద్దతు పొందాలని ప్రయత్నిస్తున్నాడని ఒకసారి నమ్మి మోసపోయిన ఈ రాష్ట్ర ప్రజలు మరోసారి జగన్ మాటలను నమ్మి మోసపోయే స్థితిలో లేరన్న విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి గుర్తుంచుకుంటే మంచిదని హెచ్చరిక చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమను కూడా తెచ్చిన పాపాన పోలేదని ఆనాడు వారు కొనసాగించిన కల్తీ మధ్యము వ్యాపారము, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు యువతను బానిసలను చేశాడని గుర్తు చేశారు. అయితే ఆనాడు జగన్మోహన్ రెడ్డికొనసాగించినటువంటి అస్తవ్యస్త విధానాల నుంచి ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషి చేస్తూ నేటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొని రావడానికి , పారిశ్రామిక రంగానికి కావలసిన అన్ని సౌకర్యాలను వనకరుస్తూ రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నారని తెలియజేశారు. అదే వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి పరిశ్రమలు రాకపోవడమే కాక రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కూడా వైసీపీ వారి అరాచకాలకు బెదిరిపోయి పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయిన సంగతిని గుర్తు చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వము అభివృద్ధి సంక్షేమము సమాన దృష్టితో ముందుకు నడిపిస్తున్నారని అలాగే గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేర్చి ప్రజల మద్దతును చురగున్నారని ఇది జీర్ణించుకోలేని జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వము పైన చంద్రబాబు నాయుడు పైన తప్పుడు ప్రచారానికి పూనుకుంటున్నారనిను తనలాగా చంద్రబాబునాయుడు ఏ రోజు వరదాల చాటు రాజకీయం చేయలేదని అనునిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి శ్రేయస్య ధ్యేయంగా పనిచేయుచున్నారని జగన్ చేసే ఆరోపణలను చూస్తే దొంగే దొంగ దొంగ అన్నట్లు జగన్ ధోరణి ఉందని తెలియజేశారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *