కూతురు పుట్టిన రోజు సందర్భంగా రక్తదానం చేసిన తండ్రి

పయమించే సూర్యుడు: మార్చి 13 అనంతపురం జిల్లా గుత్తి మండలం రిపోర్టర్: బి నిజాముద్దీన్ వార్తా విశ్లేషణ: హర్షిణి ఎన్విరాన్మెంట్ సొసైటీ అధ్యక్షుడు, మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ గుత్తి ప్రెసిడెంట్ కాయపాటి నరేష్ యాదవ్ తన కూతురు హర్షిణి యాదవ్ ఐదోవ పుట్టిన రోజు సందర్భంగా రక్తదానం చేయడం జరిగింది. అదేవిధంగాbమే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ తాడిపత్రి ప్రెసిడెంట్ పల్ల శ్రీరంగ రక్తదానం చేయడం జరిగింది. బెంగళూరులోని రామయ్య మెమోరియల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గుత్తి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన జల్లా మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అత్యవసరంగా ఏ పాజిటివ్ ప్లేట్లెట్లు అత్యవసరం కాగా తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక మంచి పని చేయాలని తలంపుతో ఉన్న తనకు నిండు ప్రాణాన్ని నిలబెట్టడమే పెద్ద అవకాశం గా భావించి గుత్తి నుంచి బెంగళూరుకు వెళ్లి ఏ పాజిటివ్ ప్లేట్లెట్లను దానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పేషంట్ బంధువులు మాట్లాడుతూ మా కోసం గుత్తి నుంచి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చి రక్తదానం, ప్లేట్లెట్లను దానం చేసినందుకు ఇద్దరికీ కృతజ్ఞతలు తెలపడం జరిగినది. అదేవిధంగా నరేష్ యాదవ్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో హర్షిని ఎన్విరాన్మెంట్ సొసైటీ ప్రారంభించడం జరిగిందని గుత్తి మరియు చుట్టుపక్కల గ్రామాలలో హరిత వనాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉదయ్ ఎన్విరాన్మెంట్ సొసైటీ అధ్యక్షుడు ఎస్.నరసింహులు తదితరులు పాల్గొన్నారు..