గర్భిణి స్త్రీలను ప్రైవేటు నర్సింగ్ హోం పంపిస్తే కఠిన చర్యలు :- ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి

పయనించే సూర్యుడు మార్చి 13. కర్నూలు జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్. ఆదోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రికి వస్తున్న గర్భిణీలను ప్రైవేట్ నర్సింగ్ హోమ్లకు పంపించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి హెచ్చరించారు. గురువారం స్థానిక ఎం సి హెచ్ హాస్పిటల్ నందు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీ (హెచ్ డి సి) సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ, మెరుగైన వైద్య సేవలు, మరియు మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్షలు నిర్వహించామని తెలిపారు. పేదలకు నాణ్యమైన చికిత్స, వైద్యుల లభ్యత, మందుల పంపిణీ, మరియు ఆసుపత్రి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెడతామని వీలైనంత తొందరలో ప్రభుత్వం తో మాట్లాడి సిబ్బంది కొరత లేకుండా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమము లో సూపరెండెంట్ మరియు కమిటీ సభ్యులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *