త్వరితగతిన సభ్యత్వాలు నమోదు పూర్తి చేయాలి.. ఎమ్మెల్యే నానాజీ..

పయనించే సూర్యుడు మార్చి 13, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బివి బి) జనసేనపార్టీ భావాలను లోతుగా అర్థం చేసుకుని సిద్ధాంతాలకు అనుగుణంగా జన సైనికులు పనిచేసి పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేయాలని జనసేనకులకు వీర మహిళలకు ఎమ్మెల్యే నానాజీ పిలుపునిచ్చారు. ప్రజలకు చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ రాష్ట్ర జనసేన పార్టీ విస్తృతస్థాయి సభ్యత్వ నమోదు జనసేన ఉద్యమి లో భాగంగా జన సైనికులు వీర మహిళలు ముందుకు వచ్చి సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు జనసేన ఉద్యమి లో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికీ 23 వేల పైచిలుకు సభ్యతుల మొదలు జరిగాయని అయితే ఈ నెల 17వ తేదీ వరకు సభ్యత్వ నమోదు కొనసాగుతుందని అలాగే 14వ తేదీ జరుగు బహిరంగ సభ ఎండల వల్ల ఏ మండలానికి ఆ మండలంలో సమావేశంలో ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు. అలాగే రూరల్ లో మరింత వేగంగా సభ్యత్వ నమోదు జరగాలని తెలియజేశారు. ఇంచార్జిగా నరసరావుపేట ఉన్నందున గత ఏడాది 35 వేలు సభ్యత్వ నమోదు జరిగిందని ఈ సంవత్సరం 50 వేల వరకు సభ్యత్వ నమోదు జరుగుతుందని భావిస్తున్నామని అన్నారు. మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తూ సభ్యత్వ నమోదుకు ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *