పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి :13: నియోజకవర్గం స్టాప్ రిపోర్టార్ :సాయిరెడ్డి బొల్లం :కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం గాంధీభవన్లో జరిగిన టిపిసిసి ఎస్సి సెల్ చైర్మన్ గా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పదవీ ప్రమాణ. దళితవాదం పునాదితోనే కాంగ్రెస్ పార్టీ నిర్మితమై ఉన్నదని అందుకే దళితుల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పని చేస్తున్నదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్లో జరిగిన టిపిసిసి ఎస్సి సెల్ చైర్మన్ గా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఆది నుండి కాంగ్రెస్ పార్టీ దళితుల సంక్షేమానికి పాటుపడుతూ వస్తున్నదని, ఆ క్రమంలోనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తూ దళితుల పక్షపాతిగా పేరు తెచ్చుకున్నదని చెప్పారు. దళితులు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండడం వల్లనే ఇన్నాళ్లు కేందాన్ని, రాష్ట్రాన్ని పాలించగలిగిందని ఆయన చెప్పారు. దళితులను విస్మరించే ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాధించదని ఆయన స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారం రేవంత రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలతోపాటు దళితులు సంతోషంగా ఉన్నారని, ఈ కారణంగానే వచ్చే ఎన్నికల్లో 100కు పైగా స్థానాలను గెలుచుకోవడం ద్వారా రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ విభాగం అత్యంత కీలక, ఈ విభాగాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దే బాధ్యతను డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు అప్పగించామని ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో దళితులకు అధిక ప్రాధాన్యాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దళితులు ప్రధాన భూమిక పోషించారన్నారు. ఆ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దళితుల అభినందికి పెద్దపీట వేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేదు విధంగా నలుగురు ఎస్సీలకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. రాష్ట్రంలో ఎస్సీ సెల్ ను బలోపేతం చేయడానికి కొత్త చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, పూర్తిస్థాయిలో అతనికి సహకరిస్తానని చెప్పారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం చేత పట్టుకొని దేశవ్యాప్తంగా తిరుగుతుండటం వల్ల దళితులకు సామాజిక హోదా పెరిగిందన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే దళితుల లక్ష్యం కావాలన్నారు. దేశ ప్రజల ఆత్మగౌరవాన్నీ ప్రధాని నరేంద్ర మోదీ అగ్ర రాజ్యం అమెరికాకు తాకట్టు పెట్టారని అద్దంకి విమర్శించారు. ట్రంప్ చెబుతేనే గ్యాస్,పెట్రోల్, డీజిల్ కొనే దుస్థితికి మోడీ చేరుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ గా పదవి స్వీకారం చేసిన డాక్టర్ కదంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ దళితుల మధ్య సుహృద్భాన్ని భావాన్ని పెంచి వారి ఏకం చేసే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతోనే తాను ఎమ్మెల్యేగా, డీసీసీ అధ్యక్షుని కాగలిగానని, ఇప్పుడు కూడా ఎస్సీ సెల్ చైర్మన్ అయ్యానని వారి ఆశలు ఆశయాలను నెరవేర్చడమే కర్తవ్యం గా పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. దామాషా ప్రకారం ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు టిఆర్ఎస్ పాలనలో దళితులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములను లాక్కున్నారని తిరిగి దళితులకు ఆ భూములను ఇప్పించాలని ఆయన కోరారు. అంతేకాకుండా అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకోవడానికి చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సీలకు ఉద్దేశించి ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన కోరారు. టిఆర్ఎస్ పాలనలో దళితులు తీరని అవమానాలు ఎదుర్కొన్నారని, ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను ఉన్నఫలంగా బర్తరఫ్ చేసి ఆయనను మానసిక క్షోభకు గురి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఆశయవాది జేబీ రాజు, బీసీ సంక్షేమం, రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, తోట లక్ష్మీకాంత రావు, మందుల సామ్యేల్ ,శ్రీనివాస్ రెడ్డి,మేడిపల్లి సత్యం, నాగరాజు,మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహులు,గడ్డం వినోద్ వెంకటస్వామి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, పుష్పలీల మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, సంపత్ కుమార్, ఎస్సీ సెల్ మాజీ చైర్మన్ ప్రీతం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ నియోజకవర్గ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు,జువ్వాడి నర్సింగ రావు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. పాపయ్య, దళిత ఉద్యమ నేత ఆరేపల్లి రాజేందర్ , తదితరులు పాల్గొన్నారు.