నేడు అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమం

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 13 మంత్రాలయం ఇంచార్జ్ రిపోర్టర్ పెద్దకడబూరు మండల కేంద్రంలో నేడు సాయంత్రం 4 గంటలకు అన్నదాత సుఖీభవ 3వ విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించనున్నారు. మండల కేంద్రంలోని చంద్రమ్మ భవన్ వద్ద ఉన్న ఎంఆర్ఓ కార్యాలయం సమీపంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ మంత్రాలయం ఇంచార్జ్ ఎన్. రాఘవేందర్ రెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు.