
పయనించే సూర్యుడు రిపోర్టర్ : శ్రవణ్ రాజ్ అనకాపల్లి జిల్లా చీడికాడ చీడికాడ బిసి బాలికల హాస్టల్ లో మౌళిక సదుపాయాలు కల్పించాలని నాయకుడు సీఐటీయూ నాయకులు నాయడు డిమాండ్ చేసారు వారు బీసీ బాలికల హాస్టల్ లో విద్యార్థులతో మాట్లాడుతూ ఈ హాస్టల్లో విద్యార్థులకు కనీసం మౌలిక సదుపాయాలు లేవని, 120 మంది విద్యార్థులు కు కనీసం తాగడానికి మంచి నీరు కూడా లేదు ఈ హాస్టల్లో ఒకే ఒక మరుగుదొడ్లు ఉంది, ఇంత మంది విద్యార్థులకు స్నానం చేయడానికి కూడా ఒకటే రూమ్ ఉంది, ఇంత మంది విద్యార్థులకి పడుకోవడానికి చదువుకోవడానికి కూడా ఒకే రూమ్ లో ఉంటున్నారు, వీటితోపాటు హాస్టల్లో భోజనం సక్రమంగా పెట్టకపోవడం సక్రమంగా వంట చేయకపోవడం సక్రమంగా వండి పెట్టమని అడిగితే విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం తో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు వీటితోపాటు ప్రభుత్వం విద్యార్థులకు వండి పెట్టమని ఇచ్చిన సరుకులు. బియ్యం కూడా బయట అమ్మేసుకుంటున్నారు దీనిపై విద్యార్థులు ఆందోళన చేయడంతో నిన్న అనగా బుధవారం బీసీ సోషల్ వెల్ఫేర్ డిడి శ్రీలక్ష్మిగారు వచ్చి తూతూ మంత్రంగా విచారణ చేశారు విచారణలో భాగంగా వార్డెన్ తో పాటు వర్కర్స్ ని ట్రాన్స్ఫర్ చేశామని చేతులు దులుపుకున్నారు 120 మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి విద్యార్థులు అందరికీ మౌలిక సదుపాయాలు కల్పించాలి మౌలిక సదుపాయం బాగో పోవడంతో విద్యార్థులందరూ అనారోగ్యానికి గురవుతున్నారు ప్రభుత్వం ఈ హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థులందరికీ సరిపడా హాస్టల్ బిల్డింగ్ కి సొంత నిధులు కేటాయించి సొంత బిల్డింగ్ కట్టాలని డిమాండ్ ప్రభుత్వం ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆర్ దేముడు నాయుడు సిపిఎం మండల కార్యదర్శి