పెద్దకడబూరులో ఘనంగా వైసీపీ ఆవిర్భావ వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 13 మంత్రాలయం ఇంచార్జ్ రిపోర్టర్ పెద్దకడబూరు మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో వైసీపీ ఆవిర్భావ వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ, మండల నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైసీపీ పార్టీ స్థాపించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం గర్వకారణమన్నారు. పార్టీ స్థాపకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో అణగారిన వర్గాలకు అండగా నిలుస్తూ వారి సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. పేదలు, రైతులు, కార్మికులు, మహిళలు వంటి అన్ని వర్గాల అభివృద్ధి కోసం పార్టీ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేసి, కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *