పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 13 మంత్రాలయం ఇంచార్జ్ రిపోర్టర్ పెద్దకడబూరు మండల కేంద్రంలో గురువారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పెద్దకడబూరు గ్రామంలోని ఒకటో వార్డులో నెలకొన్న పారిశుద్ధ్య, డ్రైనేజీ, తాగునీటి సమస్యలపై ఈఓఆర్డీ జయరాముడిపై ఎంపీపీ శ్రీవిద్య, ఎంపీటీసీ నరవ శశిరేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ పరిశీలించినా అధికారులు సీరియస్‌గా వ్యవహరించకపోవడం అభివృద్ధిని నిరోధిస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు.