పెళ్లిలో కట్నాలు , కానుకలకు చెక్

పయనించే సూర్యుడు మార్చ్13-3-26 కొమరం భీమ్ ఆసిఫాబాద్ డిస్టిక్ జైనూర్ మండల్ రిపోర్టర్ వడ్డీ జనార్ధన్ వార్తా విశ్లేషణ ::పారా గ్రామస్తుల ఏకగ్రీవ నిర్ణయం జైనూర్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పారా గ్రామస్థులు పెళ్లిళ్లలో కట్నాలు, ఖరీదైన కానుకలను నిషేధిస్తూ ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. గురువారం జరిగిన గ్రామ సమావేశంలో పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొని ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పెళ్లిళ్లలో కట్నాలు, విలువైన కానుకల వల్ల పేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. అందుకే ఇకపై గ్రామంలో జరిగే వివాహాల్లో కట్నాలు, కానుకలు ఇచ్చిపుచ్చుకోవద్దని నిర్ణయించారు. అలాగే గ్రామంలో ఎవరైనా పెళ్లి చేసుకుంటే ప్రతి కుటుంబం చందాలు వేసి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటున్న ఆత్రం గుంవంత్‌రావుకు గ్రామస్థులు కలిసి రూ.25 వేల ఆర్థిక సహాయం అందజేశారు. సమావేశంలో గ్రామపెద్దలు కుమ్ర నగేష్ పటేల్, మెస్రం జంగు, కుమ్ర కొద్దు, కుమ్రం బుజంగరావు, మాడవి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.