ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

పయనించే సూర్యుడు న్యూస్ సమీయొద్దీన్ మెట్ పల్లి మార్చ్ 13 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం రోజున 1వ వార్డు జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు చెత్తాచెదారాన్ని ఊడ్చి ఆటోలో లిఫ్ట్ చేయడం మరియు 11వ వార్డులో పారిశుద్ధ్య పనులను మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి పర్యవేక్షించినారు చైర్మన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో స్వచ్ఛంద సంస్థలు ప్రజలు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరినారు ఒకటో వార్డు జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలను చెత్తాచెదారాన్ని తొలగించడం జరిగిందని మరియు పదకొండవ వార్డు లో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ కౌన్సిలర్స్ బత్తుల నరేష్,ధోనికెల శిరీష నవీన్ మాసుల ప్రవీణ్ నునుగొండ నరేష్ పందిరి రమేష్ రెబ్బెస్ మహేష్ ఖాజా అజీమ్ సానిటరీ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు , ముజీబ్ నరేష్ నిజాం పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *