ప్రెస్ క్లబ్ భవనానికి స్థలం కేటాయించాలని వినతి

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మార్చి 13 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మున్సిపల్ కార్యాలయంలో గురువారం మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్, కమిషనర్ కీర్తి నాగరాజులకు ప్రెస్ క్లబ్ భవనానికి స్థలం కేటాయించాలని ప్రెస్ క్లబ్ జేఏసీ ఆద్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చింతకుంట సాయికుమార్ మాట్లాడుతూ పట్టణంలో జర్నలిస్ట్ సేవలు అందించుటకు శాశ్వత ప్రెస్ క్లబ్ భవనం అత్యంత అవసరం ఉన్నది. ప్రజలకు, రాజకీయ నాయకులకు, ప్రభుత్వానికి అధికారులకు సామాజిక సేవ సంస్థలు, విద్యార్ధి, యువజన, కుల తదితర సంఘాల భావ వ్యక్తీకరణ కోసం, సమస్యల పరిష్కారానికి అందరికి అందుబాటులో పాత్రికేయుల సేవలు అత్యవసరంగా మారాయి. ఇట్టి ప్రజా సౌకర్యాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని రాయికల్ పట్టణంలోని ప్రభుత్వ పరిధిలో ఉన్న ఖాళీ స్థలంలో దాదాపు మూడు గుంటలకు తగ్గకుండా ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కొరకు భూమి కేటాయించవలసిందిగా పురపాలక సంఘం తరుపున తీర్మానం చేసి సంబంధిత శాఖల అధికారులకు పంపించి అట్టి భూమిని కేటాయించాలని వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ తురగ సౌజన్య, కమీషనర్ ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ జేఏసీ ప్రధాన కార్యదర్శి సింగిడి శంకరయ్య, కోశాధికారి కడకుంట్ల జగదీశ్వర్, గౌరవ అధ్యక్షులు సయ్యద్ రసూల్, ఉప అధ్యక్షులు యచామనేని కిరణ్ బాబు, సీనియర్ జర్నలిస్టులు ఎండి ముజఫర్, మాజీ అధ్యక్షులు వాసరి రవి, వాసం లింబద్రి గంగాధరి సురేష్, సభ్యులు ఇమ్మడి విజయ్ కుమార్, గట్టుపెళ్లి నరేష్, ఎండి షాకీర్, గన్నవరం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *