మత్స్య సంపదతో లాభదాయక ఆదాయం.

* మత్స్యకారులు ప్రభుత్వ రాయితీలు సద్వినియోగం చేసుకోవాలి. * మత్స్యశాఖ ఆధ్వర్యంలో90%రాయితీతో3,54,300చేప పిల్లలు విడుదల.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి. 13.2026 పోలవరం జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం ముసురుమిల్లి జలాశయంలో చేప పిల్లలు విడుదల చేసిన ఎమ్మెల్యే,రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి. మత్స్య సంపదతో లాభదాయక ఆదాయం సమకూరుతుందని. రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి అన్నారు. రంపచోడవరం మండలం ముసురుమిల్లి జలాశయంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం (PMMSY) ద్వారా గురువారం జిల్లా మత్స్యశాఖ అధికారి దిల్షాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమెకు మత్స్య శాఖ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.అనంతరం ఆమె ఐటిడిఎ పధక నిర్వహణ అధికారి బచ్చు స్మరణ రాజు సౌజన్యంలో 3,54,300 చేప పిల్లలను జిల్లా వ్యాప్తంగా ఉన్న జలాశయాల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… మత్స్య సంపదతో గిరిజన మత్స్య కారులకు చాలా ప్రయోజనాలున్నాయన్నారు. అలాగే PMMS-ధర్తీ అభా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ (DAJGUA) పథకం ద్వారా 90% రాయితీతో చేప పిల్లలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. మత్స్య పెంపకానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు.ఆయా పథకాలను గిరిజన మత్స్య కారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మత్స్య శాఖ సిబ్బంది.కూడా మత్స్యకారులకు చేపల పెంపకం, చేపల వేటలపై సాంకేతిక పరిజ్ఞానం అందించాలని సూచించారు. అలాగే జిల్లా వ్యాప్తంగ 2,74,500 చేపపిల్లలు విడుదల చేశారు. దానిలో భాగంగా ముసురుమిల్లి జలాశయంలో 1,57,500 నేలకోట ఆవలో 45,000 మగలిగెడ్డ రిజర్వాయర్లో 13,500 బండకొండ ట్యాంక్లో 13,500 మరియు సూరంపాలెం రిజర్వాయర్ లో 45,000 మొత్తం 2,74,500 చేపపిల్లలు విడుదల చేశారు. అలాగే భూపతిపాలెం రిజర్వాయర్ లో 34,264 దయ్యాలగుమ్మి రిజర్వాయర్ లో 3420 గింజర్తి రిజర్వాయర్ లో 3480 వట్టిగెడ్డ రిజర్వాయర్ లో 6840 మరియు మద్దిగెడ్డ రిజర్వాయర్ లో 31856 చేపపిల్లలను రెండో దఫాగా మొత్తం ఆయా జలాశయాలలో 79,800 చేప పిల్లలు విడుదల చేశారు. మత్స్యకారులకు భీమా సదుపాయాలపైచైతన్యం చేయాలన్నారు. ప్రభుత్వం ద్వారా భీమా పథకాలు వర్తింపు చేయాలన్నారు. ప్రభుత్వం ద్వారా బోట్లు జాకెట్లు వగైరా మార్కెటింగ్ కొరకు వాహనాలు ఇలా అవసరం అయిన వాటిని రాయితీపై అందించే ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ సభ్యులు షేక్ సుభానీ, నియోజక వర్గ ఎస్టీ అధ్యక్షులు పండా చెల్లన్న దొర(బాబీ), సీతపల్లి గుడి చైర్మన్ కుంజం బాపన్న దొర, అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు అడబాల బాపిరాజు, దేవీపట్నం మండల పార్టీ అధ్యక్షులు గోళ్ల చంటిబాబు, కోసు నాగన్న దొర, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు స్వప్న కుమారి, జనసేన నియోజక వర్గ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కుర్ల రాజశేఖర్ రెడ్డి, పాపోలు శ్రీనివాసరావు, సీతపల్లి గుడి దేవస్తానం సభ్యులు సిద్ధ వెంకన్న దొర, గణపతి, పతి వాడ రమణ, కె.సురేష్ బాబు రామన్న దొర మత్స్య సిబ్బంది జిల్లా మత్స్యశాఖ అధికారి ఎస్.కె దిల్షాద్, DFCS ఉపాధ్యక్షుడు భోలా నాగేశ్వర్ రావు, పరిశీలకుడు టి.సంతోష్, ఎఫ్‌డిఓ ఎ.అనిల్ మరియు ఆయా సొసైటీల సంఘం ప్రెసిడెంట్, సెక్రటరీ, సంఘం సభ్యులు కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *