పయనించే సూర్యుడు-13-03-2026-రాజంపేట న్యూస్ : ప్రతి మహిళ ఆరోగ్యవంతులుగా ఉండేందుకు కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి పెద్ద పీట వేసిందని జనసేన రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ తెలిపారు. మండల కేంద్రమైన సిద్ధవటం కమ్యూనిటీ వైద్యశాలలో గురువారం పి.కొత్తపల్లి వైద్యాధికారి డాక్టర్ రంగలక్ష్మి ఆధ్వర్యంలో హెచ్ పి వి వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో ప్రతి మహిళ ఆరోగ్యవంతంగా ఉండేందుకు 14 ఏళ్ల మహిళలకు ఉచితంగా గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ రాకుండా ఆరోగ్య వంతులుగా ఉండేందుకు హెచ్ పి వి టీకా వేయడం హర్షించదగ్గ విషయమని, ప్రవేట్ వైద్యశాలలో రూ 6 వేలు అవుతుందని, పేద మరియు బలహీన వర్గాల మహిళలు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కొరకు తన వంతు కృషి చేస్తానని.. డాక్టర్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి పాలకొండ్రాయుడు, పి.కొత్తపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ రంగలక్ష్మి, డాక్టర్ ప్రకాష్, జోష్ణ, వరప్రసాద్, మురళి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ప్రతినిధి శ్రీకాంత్, సర్పంచ్ ప్రతినిధి బి ఓబులయ్య సిహెచ్ఓ, లక్ష్మీనరసమ్మ, హెల్త్ అసిస్టెంట్ వెంకటసుబ్బయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహబూబ్ బాషా, ఏ.చిన్న వెంకటయ్య, విజయ్, పసుపులేటి గంగయ్య, షేక్ గౌస్ బాష, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.