పయనించే సూర్యుడు మార్చి 13 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ మానవ జీవిత కాలం పాటు ప్రతి ఒక్కరూ కంటి దృష్టిని 100% సంరక్షించుకోవాలని నాగర్ కర్నూల్ ఆప్తాలమిక్ అధికారి కోట్ర బాలాజీ అన్నారు. గ్లూకోమా నీటి కాసుల వ్యాధి వారోత్సవాల సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తూడుకుర్తికి చెందిన ఎల్వీ ప్రసాద్ నేత్ర విజ్ఞాన శాఖ వారి ఆధ్వర్యంలో గురువారం నాడు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు.అనంతరం వ్యాధి లక్షణాలు తీవ్రత పై అవగాహన కల్పించారు.నిత్య భోజనంలో విటమిన్ ఏ సంబంధిత ఆహారాన్ని ప్రతి ఒక్కరు అధిక మొత్తంలో తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్వి ప్రసాద్ తూడుకుర్తి ఆస్పత్రి పరిపాలనాధికారి ప్రేమ్ కుమార్ సిబ్బంది రాజు, లైన్స్ క్లబ్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, కార్యదర్శి సురేష్, వాకింగ్ వండర్స్ క్లబ్ జిల్లా అధ్యక్షులు పడిగే తిరుపతయ్య మరియు సభ్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.