యాడికి లో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ 13 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా యాడికి మండల కేంద్రంలోని దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం, వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం నందు నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఘనంగా కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ప్రజల ఆశయాలను సాధించేందుకు ఏర్పడిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో యాడికి మండల వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు బాలారమేష్ బాబు యాడికి మాజీ జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి బ్రహ్మానంద రెడ్డి మహిళా ఉపాధ్యక్షురాలు లక్ష్మీదేవి యాడికి మండల కన్వీనర్ సంజీవ రాయుడు సజ్జలదిన్నె రాజు మరియు యాడికి మండలం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *