విద్యార్థులకు పరీక్షా ప్యాడ్ల పంపిణీ

పయనించే సూర్యుడు 13-02-2026 చింతకాని: స్థానికంగా ఉన్న శ్రీ గ్లోబల్ హై స్కూల్ లో విద్యార్థులకు పరీక్షల కోసం ఉపయోగపడే విధంగా శ్రీ సాయి మారుతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో పరీక్షా ప్యాడ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సరీ నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులతో పాటు పదో తరగతి విద్యార్థులకు కూడా పరీక్షా ప్యాడ్లు అందజేశారు.ఈ పంపిణీ కార్యక్రమంలో శ్రీ సాయి మారుతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల కరస్పాండెంట్ ఇనుకుల్ల దివాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల చదువుకు ప్రోత్సాహం కలిగించే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆసుపత్రి యాజమాన్యాన్ని మరియు సిబ్బందిని అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ తన్నీరు రామారావు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *