విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి హెడ్మాస్టర్ రవికుమార్

జడ్.పి.హెచ్.ఎస్ బూర్గుల పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం

పయనించే సూర్యుడు మార్చి 13 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) షాద్నగర్ నియోజకవర్గం బూర్గుల జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఈరోజు పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా పాఠశాల వార్షికోత్సవం మరియు 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం రవికుమార్ మాట్లాడుతూ… విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి ఉన్నత స్థాయికి ఎదగాలని పరీక్షల సమయంలో ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టర్ రవికుమార్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.