విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదవాలి

★ మండల విద్యాధికారి గంగుల నరేశం

పయనించే సూర్యుడు, కోరుట్ల మార్చి 13 కోరుట్ల పట్టణంలోని పి.యం. శ్రీ జిల్లా పరిషత్ బాలికల పాఠశాల యందు పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కోరుట్ల మండల విద్యాధికారి గంగుల నరేశం పదవ తరగతి తల్లిదండ్రుల విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ పరీక్షలు మార్చి 14 తేదీ నుండి ఏప్రిల్ 13 వరకు జరుగుతాయని పరీక్షల మధ్య అంతరం రోజులలో కూడా ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తామని విద్యార్థులు తరగతులకు హాజరయ్యే విధంగా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని,ప్రతి పదవ తరగతి సెంటర్ నందు విద్యార్థులకు ఫర్నిచర్, త్రాగునీరు, హెల్త్ సిబ్బంది అందుబాటులో ఉంటారని, విద్యార్థులు పరీక్షల సమయంలో ప్రణాళిక బద్ధంగా చదివే విధంగా, శారీరక ఆరోగ్యం కలిగి ఉండడానికి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఇవ్వాలని, జంక్ ఫుడ్ కు దూరంగా ఉంచాలని, ఒత్తిడికి దూరంగా ఉండే విధంగా తల్లిదండ్రులు చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.గంగాధర్, ఉపాధ్యాయులు సంతోష్, సుమలత, అరుణ, నాగరాజు, సి.ఆర్.పిలు పి.గంగాధర్, జ్యోతిలు పాల్గొన్నారు.