
పయనించే సూర్యుడు న్యూస్:మార్చి:13: నియోజకవర్గం స్టాప్ రిపోర్టార్:సాయిరెడ్డి బొల్లం: రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం లోని ఈరోజు గురువారం రోజున :12/03/2026: వెంకట్రాపూర్ నుండి జంగం రెడ్డిపల్లె వచ్చే దారిలో శ్రీ వాణి ప్రైవేట్ హైస్కూల్ చెందిన స్కూల్ బస్ రోడ్డు పక్కన ఉన్న దూసుకెళ్లింది. బస్సులో ఉన్న విద్యార్థులు కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నారు. స్థానిక వివరాలు ప్రకారంగా విద్యార్థులకు పాఠశాలకు వెళ్ళింది సమయంతో బస్ డ్రైవర్ కు నియంత్రణ కోల్పోవడంతో వాహనాం రోడ్డును వదిలి పంట పొలంలోకి దూసుకుపోయింది. అదృష్టవశాత్తు బస్సులో ఉన్న విద్యార్థులకు పెద్దగా గాయాలు ఏమీ కాలేదు భారీ ప్రమాదానికి తప్పించుకున్న ఘటనను గమనించి గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకొని విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనపై స్పందించిన ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్, శ్రీవాణి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్న వ్యక్తులు. స్కూలుకు వెళుతున్నారా లేదా అని బస్సులో కండిషన్ ఏ విధంగా ఉంది. గదిలో ఉన్నాయా లేవా. ప్రైవేటు స్కూళ్లలో అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా. అని తెలుసుకోవాలి.