వెల్గొండ బాలుర ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వయం పాలన దినోత్సవం

కార్యక్రమంలో మండల ఎంఈవో రఘునందన్

పయనించే సూర్యుడు మార్చి 13 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ వెల్గొండ గ్రామంలోని బాలుర ప్రాథమిక పాఠశాలలో ఈ రోజు స్వయం పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ బాధ్యతలను స్వీకరించి పాఠశాల నిర్వహణలో భాగస్వామ్యం అయ్యారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి రఘునందన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీ కృష్ణయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఇద్రిస్ పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. స్వయం పాలన దినోత్సవం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందుతాయని అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *