సనాతన ధర్మం జోలికొస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించం మంత్రి నారా లోకేష్

★ కోతుల బావి దేవాలయం పరిరక్షణకు కృషి చేస్తా మంత్రి ★ ఆక్రమణలకు గురవుతున్న కోతుల బావి దేవాలయం ★ మంత్రి నారా లోకేష్ ని కలిసిన విశ్వహిందూ పరిషత్ సభ్యులు విష్ణువర్ధన్, ప్రతాపరెడ్డి.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 13, 2026: గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ మంత్రి నారా లోకేష్ ను కలిసిన విశ్వహిందూ పరిషత్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, ప్రతాపరెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిసి, ఎమ్మిగనూరు లోని కోతుల బావి ఆంజనేయస్వామి దేవాలయ విషయం లో కబ్జా, అక్రమాలకు అవినీతి కి పాల్పడుతున్న వారి మీద, ఆలయ పరిరక్షణకు కృషి చేయాలనీ తెలియజేసి, వినతి పత్రం అందజేశారు. నారా లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ, సనాతన ధర్మం జోలికి , దేవాలయాలు, దేవి దేవుళ్ళ జోలికి వెళ్లే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని , కోతుల బావి ఆలయ పరిరక్షణ కోసం తగిన చర్యకు తీసుకుంటమని, అలాగే తోరలో ఎగనూరులోని శ్రీ కోతుల బావి దేవాలయాన్ని సందర్శిస్తామని అన్నట్టు విశ్వహిందూ పరిషత్ వారు తెలిపారు.