పయనించేసూర్యుడు మార్చి 13 ఆదోని డివిజన్ రిపోర్టర్ గుమ్మల బాలస్వామి ఆదోని గడ్డపై రాజకీయ పోరు మరోసారి ముదిరింది. భూ ఆక్రమణల విషయంలో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరించిన ప్రస్తుత ఎమ్మెల్యే పార్థసారథి, క్షేత్రస్థాయిలో ఆధారాలతో సహా విరుచుకుపడ్డారు. గురువారం మండలంలోని సర్వే నంబర్ 630 లో 3.34 ఎకరాలలో దారి పరం పోగులో 2026 మార్చి 5వ తేదీన భూ బకాసురులు పత్రికల్లో ప్రచురితమైంది. స్పందించిన ఎమ్మెల్యే పార్థసారథి సర్వేనెంబర్ 630 భూమి క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. సుందరమైన ఆదోని నీ తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఇకనుండి 2019 నుండి 2024 వరకు ఆదోని నియోజకవర్గంలో వైసీపీ నాయకుల కబ్జాలను బట్టబయలు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్వే నంబర్ 630 వివాదం సర్వే నంబర్ 630లో సుమారు 3.34 ఎకరాల భూమిని వైసీపీ అనుచరులు కబ్జా చేశారని, దీనికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారుదోషులుగా నిలబెడతాం ప్రజల ఆస్తులను దోచుకుంటే చూస్తూ ఊరుకోనని ఆక్రమణదారులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టడం ఖాయమని హెచ్చరించారు. పిల్లలతో ఆడుకోండి రాజకీయాలు మాకు వదిలేయండి:మాజీ ఎమ్మెల్యేకు చురకలు అంటిస్తూ వయసు పైబడింది, హరే రామ.. హరే కృష్ణ అంటూ ఇంట్లో పిల్లలతో గడుపుతూ విశ్రాంతి తీసుకోవడం మంచిది" అని ఎమ్మెల్యే పార్థసారథి సలహా ఇచ్చారు. ఆదోని అభివృద్ధి కోసం తాను నిరంతరం తిరుగుతూనే ఉంటానని, సుందరమైన ఆదోనిని నిర్మించడమే తన లక్ష్యమని పార్థసారథి ధీమా వ్యక్తం చేశారు. అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలనకేవలం మాటలకే పరిమితం కాకుండా, రెవెన్యూ అధికారులతో కలిసి ఎమ్మెల్యే వివాదాస్పద భూములను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శేషపణి వీఆర్వోలు రాజశేఖర్ గౌడ్, ఈరన్న, సర్వేయర్ హరికృష్ణ, ఆర్ఐ లక్ష్మన్న.బీజేపీ నాయకులు పాల్గొన్నారు.