సాగరంలో వైఎస్సార్‌సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ : మార్చ్ 13 అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా అనంతసాగరం మండల కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు మిఠాయిలు పంచి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అనంతసాగరం మండల ఎంపీపీ పేయ్యల సంపూర్ణమ్మ, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ బిజి వేముల పిచ్చిరెడ్డి, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మెట్టుకూరు సుబ్బారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు అల్లంపాటి సుధాకర్ రెడ్డి, కేత రవీంద్రారెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ బట్రెడ్డి నాగేంద్ర రెడ్డి, మెట్టుకూరు శ్రీనివాసులు రెడ్డి, పంట రామిరెడ్డి, బుట్టి రాజశేఖర్ రెడ్డి, షేక్ ఖాజా తదితరులు పాల్గొన్నారు.