10 వ తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు.

★ ఎంఈఓ రాజీమంజుష.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 13 బోధన్ : సాలూరలో పదో తరగతికి ఒకటే పరీక్ష కేంద్రం ఉంటుంది. పరీక్షల నిర్వహణలో భాగంగా సాలూర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాట్లను చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి రాజీ మంజూష గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 4 పాఠశాలల నుంచి 214 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్ష రాయనున్నట్లు స్పష్టం చేశారు. పరీక్ష నిర్వహణ కొరకై చీఫ్ సూపర్డెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ అండ్ ఇన్విజిలేటర్ల నియామకం ఇప్పటికే జరిగిందన్నారు.పరీక్ష నిర్వహణకు మొత్తం 9 గదులను సిద్ధం చేయడం జరిగింది. పరీక్ష గదులను శుభ్రం చేసి ఫర్నిచర్ ను కావలసిన విధంగా ఏర్పాటు చేశారు. ఎటువంటి చిత్తు కాగితాలు పాఠశాల ఆవరణలో లేకుండా శుభ్రం చేశారు. విద్యార్థులకు మంచినీటి సౌకర్యము, మరుగుదొడ్ల అందుబాటులో ఉన్నాయి.అలాగే స్వల్ప అనారోగ్యాలకు చికిత్స చేయడానికి ఏఎన్ఎంను నియమించారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కి తావు లేకుండా ఈ సంవత్సరము పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తామని ఎంఈఓ తెలిపారు.