పయనించే సూర్యుడు మార్చి 13 కరీంనగర్ న్యూస్: భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి , కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు , కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ఈనెల 14న చేపట్టనున్న కొండగట్టు అంజన్న స్వామి ఆశీర్వాద పాదయాత్ర లో కార్మికులంతా పాల్గొనాలని ఉమ్మడి జిల్లా కార్మిక జేఏసీ చైర్మన్ చాడ ఆనంద్ కోరారు . ఈ మేరకు గురువారం రోజున చాడఆనంద్ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 14వ తేదీ శనివారం ఉదయం 7 గంటలకు కరీంనగర్ చైతన్యపురి సమీపంలోని మహాశక్తి ఆలయం వద్ద నుండి ఘనంగా ప్రారంభమై కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వరకు జరుగుతున్న ఈ పాదయాత్రలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పాదయాత్ర ద్వారా కార్మికుల ఐక్యత మరింత బలపడటంతో పాటు సామాజిక చైతన్యం పెంపొందించి ప్రజా సమస్యలపై అవగాహన పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్మికులు పాదయాత్రకు మద్దతు తెలుపుతూ కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దివ్య ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. కరీంనగర్ పట్టణంలో ఉన్న కార్మికులు మరియు కార్మిక సంఘాల నాయకులు ఉదయం మహాశక్తి ఆలయం వద్దకు చేరుకోవాలని, అలాగే మిగతా మండలాలు, గ్రామాలలో ఉన్న కార్మిక నాయకులు పాదయాత్రకు మార్గమధ్యంలో స్వాగతం పలుకుతూ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా జేఏసీ చైర్మన్ చాడా ఆనంద్ ఈ ప్రకటనలో కోరారు.