అగ్ని ప్రమాద వార్తపుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలో బిల్లేరు దగ్గర కానసాహెబ్ మెట్ట, చౌడేపల్లి మండలం లో అగ్నిప్రమాదం

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 15.03.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి 0 ప్రతినిధి జె. నాగరాజ) 14-03-2026, సమయం సుమారు 13.55 గంటలకు అగ్ని ప్రమాద వార్త వచ్చింది వెంటనే సిబ్బందితో బయలుదేరి ప్రమాద స్థలమునకు వెళ్లి అన్సర్ భాష తండ్రి పేరు ఎస్. అన్వర్ సాహెబ్ చెందిన మామిడి తోట మరియు కం చెఅగ్ని ప్రమాదానికి గురై ఉండెను. రహదారి సరిగ్గా లేక సిబ్బందితో మరియు ఫైర్ బీటర్స్ తో అక్కడి పుర ప్రజల సహాయముతో మంటలను పూర్తిగా అదుపు చేయడం జరిగింది. ఈ అగ్ని ప్రమాదం నందు నష్టం సుమారు రూపాయలు 10,000 వరకు ఉండొచ్చు ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఎవ రో గుర్తు తెలియని వ్యక్తులు ధూమపానం సేవించి ముక్కలు ఆర్పకుండా పారవేసిన ముక్కలు వలన ప్రమాదం జరిగి ఉండవచ్చునని ఊహించడమైనది. ఈ అగ్ని ప్రమాదం నందు పుంగనూరు అగ్నిమాపకు సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఇట్లు ఎన్. సుబ్బరాజు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పుంగనూరు.