అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం.

పయనించే సూర్యుడు మార్చ్ 15 కర్నూలు జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద మూడవ విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ మాట్లాడుతూ—రాష్ట్రంలో సాగు భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి, అటవీ భూమి సాగుదారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోంది అని తెలిపారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ₹14,000, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా ₹6,000 కలిపి ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి ₹20,000 ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు మూడవ విడత కింద 46,85,838 మంది రైతు కుటుంబాలకు ₹2,675.97 కోట్ల నిధులు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు విడుదలైన నిధులను పరిశీలిస్తే ఆగస్టు 2న మొదటి విడతగా ₹3,174.43 కోట్లు నవంబర్ 19న రెండో విడతగా ₹3,135.01 కోట్లుఇలా రెండు విడతల్లో కలిపి ₹6,309.44 కోట్లు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఈ పథకం ద్వారా సుమారు 46,80,000 మంది రైతులు లబ్ధి పొందుతుండగా, మొత్తం ₹2,008 కోట్ల బడ్జెట్ కేటాయించబడిందని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో మొత్తం 2,72,757 మంది రైతులు లబ్ధి పొందుతుండగా, వారికి ₹154.94 కోట్ల నిధులు అందుతున్నాయని తెలిపారు.అలాగే ఆదోని నియోజకవర్గం పరిధిలో 1,872 మంది రైతులు లబ్ధి పొందుతుండగా, వారికి ₹10.38 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది అని వెల్లడించారు. రైతు దేశానికి వెన్నెముక అని చెప్పడమే కాదు, రైతు చేతిలో నేరుగా డబ్బు చేరే విధంగా సంక్షేమ పథకాలను అమలు చేయడం కూటమి ప్రభుత్వ ప్రత్యేకత అని శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ అన్నారు. రైతు బలపడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, రాష్ట్ర అభివృద్ధి వేగవంతం అవుతుందని తెలిపారు.చివరగా జిల్లాలోని అన్ని రైతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ,అన్నదాత సంతోషమే రాష్ట్ర సమృద్ధికి పునాది” అని పేర్కొన్నారు.